Prabhas | అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ’ ‘ రాజా సాబ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘కల్కి’ చిత్రం జూన్ 27న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీంతో ప్రభాస్ తన తదుపరి సినిమా ‘సలార్-2’ (శౌర్యంగ పర్వం) కోసం సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారని, తొలి షెడ్యూల్లో ప్రభాస్‌తో పాటు ప్రతినాయక పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తారని సమాచారం.
తొలిభాగంలోనే ‘సలార్’ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఈ సినిమా స్క్రిప్ట్‌పై ఆయన మరింతగా దృష్టిపెట్టారని, తొలుత అనుకున్నట్లుగా కాకుండా చాలా మార్పులతో సీక్వెల్‌కు స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.