Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించదు. తన వర్కవుట్ వీడియోలను తరచుగా సోషల్‌మీడియా లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఏకంగా 100కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తిపడేసింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. “కుబేర’ సినిమా నైట్ షూట్స్‌తో చాలా బిజీగా ఉన్నా.
ఉదయం 8గంటలకు హోటల్ రూమ్‌కి చేరుకున్నా. ఎందుకో తెలియదు కానీ నిద్రపట్టలేదు. దాంతో పుస్తకం చదువుతూ కూర్చున్నా. మధ్యాహ్నం 12 గంటలకు నిద్రపోయి సాయంత్రం లేచాను. భోజనం పూర్తయ్యాక అర్థరాత్రి 1 గంట సమయంలో జిమ్‌కి వెళ్లాను. కార్డియో చేద్దామంటే మూడ్ రాలేదు. దాంతో వంద కిలోల డెడ్‌లిఫ్ట్ చేశాను. ఒక్కసారిగా ఒత్తిడి మొత్తం మాయమైపోయింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.