Vijay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దళపతి 67 గా వస్తున్న ఈ చిత్రానికి లియో (Leo.. Bloody Sweet) టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ప్రోమో వీడియో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఫొటో రూపంలో తెరపైకి వచ్చింది.
విజయ్-త్రిష ఓ విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో కలిసి ఫొటో దిగారు. కశ్మీర్ లొకేషన్లో దిగింది ఈ స్టిల్. దీన్ని బట్టి చూస్తే లియో షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని అర్థమవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ మొత్తానికి తాను లియో షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఇలా తెలియజేస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్ తోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని, నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకోగా.. సన్ టీవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందని తెలియజేస్తూ ఇప్పటికే సెవెన్ స్క్రీన్ స్టూడియో అప్డేట్ కూడా ఇచ్చేసింది. విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది లియో.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లియోకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తోపాటు రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ క్రేజీ సినిమాకు అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్. మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్లో రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఎయిర్‌హోస్టెస్‌తో విజయ్-త్రిష ఇలా..
#Leo pair ❤️ @actorvijay and @trishtrashers.#Vijay #ThalapathyVijay𓃵#Trisha #TrishaKrishnan #Thalapathy pic.twitter.com/2CRpXN1Tzd
— Rajesh Kumar Reddy (@rajeshreddyega) February 26, 2023
కశ్మీర్ లొకేషన్లో త్రిష..
#Leo girl #Trisha Instagram Story From Kashmir 🥶❤️@actorvijay 👑 pic.twitter.com/03E5ft3Da2
— #Leo (@VijayFanCraze) February 18, 2023
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
Read Also :
SSMB 28 | మహేశ్‌బాబుతో వన్స్‌మోర్.. ఎస్ఎస్ఎంబీ 28లో టాలెంటెడ్ యాక్టర్..!
Mahesh babu | సూపర్ యంగ్ లుక్‌లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్‌గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్