యువహీరో రాజ్‌తరుణ్- లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా హాట్‌టాపిక్‌గా మారింది. గత పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘తిరగబడరా సామీ’ చిత్ర ప్రీరిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించగా అక్కడ రాజ్‌తరుణ్‌ను కలుసుకోవడానికి వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. తన భర్త రాజ్‌తరుణ్‌తో మాట్లాడాలంటూ లావణ్య పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
అనంతరం ఈ వివాదం గురించి రాజ్‌తరుణ్ ప్రెస్మీట్లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. అందుకే ప్రతీసారి మీడియా ముందుకొస్తున్నది. ఈ విషయంలో నేను లీగల్‌గా వెళ్తున్నాను. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాపై తప్పుడు కేసులు పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పించుకొని తిరగడం లేదు. పోలీసుల నోటీసులపై నేను స్పందించాను. నాకు ఇండస్ట్రీలో ఎంతో మంది సన్నిహితులున్నారు. నేను మంచి వాడిని కాదని ఇండస్ట్రీలో ఎవరైనా చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని రాజ్‌తరుణ్ చెప్పారు. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘తిరగబడరా సామీ’ చిత్రం ఆ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది.