Lavanya | టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ (Raj tarun) -లావణ్య (Lavanya) కేసు వ్యవహారం ఏదో ఒక రకంగా హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. తాజాగా ఆర్జే శేఖర్ భాషా తనపై దాడి చేశాడంటూ నటి లావణ్య జూబ్లీహిల్స్ పీఎస్‌లో పిర్యాదు చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో శేఖర్ భాషా తనపై పదే పదే ఆరోపణలు చేస్తుండగా.. ప్రశ్నించేందుకు వెళ్లగా తనపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ భాషా (shekar basha) తనను చూడగానే కడుపుపై తన్నడంతోపాటు విచక్షణా రహితంగా కొట్టాడని ఆరోపించింది. తాజాగా ఈ వ్యవహారంలో శేఖర్ భాషా రావడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.
ఇప్పటికే ముగ్గురిపై కేసు…
రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడంటూ. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించింది.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు. నన్ను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి. మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరించారు. మాల్వీతోపాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది.
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్