Nayanthara 75 Movie shoot Begins | లేడి సూపర్ స్టార్ నయనతార దశాబ్ద కాలంగా దక్షిణాదిలో అగ్ర కథానాయికగా చెలామణి అవుతుంది. అంతేకాదు దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో అగ్ర స్థానం నయనతారదే. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమా అంటే దర్శక నిర్మాతలకు ఫస్ట్ ఆప్షన్ నయన్‌తారనే. అయితే గతకొంత కాలంగా నయన్‌ను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు వెంబటిస్తున్నాయి. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నయన్.. ఈ మధ్య కాస్త డల్ అయింది. ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడున్నాయి. అయితే ఫలితం ఎలా ఉన్నా నయన్ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నయన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి.
ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభించింది. చిత్రబృందం నయనతారకు గ్రాండ్‌గా వెలకమ్ చెప్పింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో జై హీరోగా నటిస్తున్నాడు. రాజారాణి తర్వాత దాదాపు పదేళ్లు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ధమన్ ఈ సినిమాను స్వరాలు సమకూర్చుతున్నాడు.
ఇక ఇటీవలే నయన్ నటించిన కనెక్ట్ ఘోరంగా డిజాస్టర్ అయింది. తెలుగులో అదే పేరుతో యువీ క్రియేషన్స్ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సేమ్ రియాక్షన్ వచ్చింది. ప్రస్తుతం నయన్ షారుఖ్‌తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. అట్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. దీనితో పాటుగా ఇరైవన్ అనే తమిళ సినిమా చేస్తుంది.
Lady Superstar’s ‘Nayanthara 75’ shooting started with the blessings of Superstar. pic.twitter.com/06VZAOgwYV
— LetsCinema (@letscinema) April 8, 2023