JagadishReddy | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతూ.. తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. దీనిపై తెలంగాణ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్) తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది.! తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా తెలివితక్కువ మాటలు అని జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా పవన్‌కి కౌంటర్ ఇస్తూ.. ”అసలు మా దిష్టి వాళ్లకి తాకడం కాదు… ఇన్నేళ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకింది” అని ఆయన కౌంటర్ ఇచ్చారు. అంతేకాక, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ… మెదడు వాడకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.