Mad Square | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో కాంబోలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ (Mad). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ (Mad 2) వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా, లుంగీలో స్టైలిష్‌గా కనిపిస్తూ.బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో తిరిగొస్తున్నట్టు చెబుతున్నారు.
తాజాగా లడ్డూగాని పెళ్లి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సినిమాలో యూత్‌ను ఇంప్రెస్ చేసే డబుల్ డోస్ వినోదం ఉండబోతున్నట్టు తాజా సాంగ్ ప్రోమోతో చెప్పకనే చెబుతున్నాడు డైరెక్టర్. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు.
మ్యాడ్‌లో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారని తెలిసిందే. మరి సీక్వెల్లో సందడి చేసే భామలు ఎవరనేది తెలియాల్సి ఉంది. సీక్వెల్ ప్రాజెక్ట్‌ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
లడ్డూగాని పెళ్లి సాంగ్ ప్రోమో..
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?