Mad Square | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్ (Mad). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్కు సీక్వెల్‌గా వస్తోన్న ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (Mad 2). ఇప్పటికే సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా, లుంగీలో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్ లుక్‌తోపాటు లడ్డూగాని పెళ్లి సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. లడ్డూగాని పెళ్లి సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని వీడియో సాంగ్ చెప్పకనే చెబుతోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని అర్థమవుతోంది. బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నట్టు తాజా సాంగ్ చెప్పకనే చెబుతోంది. మొత్తానికి తొలి పాటతోనే సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్.
ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సీక్వెల్లో ఎవరెవరు కనిపిస్తారనేది సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
లడ్డూగాని పెళ్లి లిరికల్ వీడియో సాంగ్..
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | గోవా నుంచి హైదరాబాద్‌కు జానీ మాస్టర్..
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?