Laapata Ladies actor | అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన చిత్రం లాపతా లేడీస్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. లాపతా లేడీస్‌లో దీపక్ కుమార్ పాత్రలో మెరిసి తన యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేశాడు రాజస్థానీ యాక్టర్ స్పర్శ్ శ్రీవాత్సవ. ఈ క్రేజీ యాక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. స్పర్శ్ శ్రీవాత్సవ తెలుగులో సినిమాలో నటించే ఆఫర్ కొట్టేశాడు. ఇంతకీ హీరో ఎవరనుకుంటున్నారా..? అక్కినేని నాగ చైతన్య.
చైతూ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో NC24 చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రాబోతుంది. లాపతా లేడీస్ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ NC24 మిథికల్ వరల్డ్‌లో జాయిన్ అయ్యాడంటూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. హుడీ షర్ట్‌లో ఉన్న స్పర్శ్ శ్రీవాత్సవ. లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్.
లక్కీ భాస్కర్ ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ సమకూరుస్తున్నాడు.
The world saw his gentle charm…
Now, get ready for his NEVER BEFORE SEEN AVATAR 🔥🔥🔥Happy Birthday #SparshShrivastava 🤗
Welcome to the Mythical world of #NC24 ❤️🔥 pic.twitter.com/AUsIF0A2na— NC24 (@Nc24chronicles) August 28, 2025
Param Sundari | ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్.. లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న సిద్ధార్థ్, జాన్వీ
lakshmi menon | ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట