L2 Empuraan Row | ఎల్2 : ఎంపురాన్ మూవీకి కేరళ సీఎం పినరయి విజయన్ మద్దతు ప్రకటించారు. సంఘ్ పరివార్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. చిత్రంలో దేశంలోనే అత్యంత దారుణమైన మారణహోమం గురించి ప్రస్తావించారన్నారు. అందుకే సంఘ్ పరివార్ ఆగ్రహంతో ఉందని.. మూవీని సినిమా థియేటర్లో చూశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయన్ ఎంపురాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఇది మలయాళ చిత్ర పరిశ్రమను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే చిత్రమని పేర్కొన్నారు. సంఘ్ పరివార్ ఈ చిత్రాన్ని, నటులను, సిబ్బందిపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. పార్టీ అధికారులే కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు సైతం నిర్మాతలను బహిరంగంగానే బెదిరిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. చిత్రాన్ని తిరిగి సెన్సార్ చేసి ప్రదర్శించేలా నిర్మాతలను బలవంతం చేస్తున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. సంఘ్ పరివార్ సృష్టించిన ఈ భయానక వాతావరణం ఆందోళనకరమైందన్నారు.
మోహన్ లాల్ ఫేస్ బుక్ పోస్టులో ‘ఎంపురాన్’పై వచ్చిన రాజకీయ, సామాజిక అంశాలు నా అభిమానులను చాలామందిని నిరాశపరిచాయని తెలిసిందన్నారు. ఓ కళాకారుడిగా ఏ సినిమాలోనూ ఏ రాజకీయాలు, మతంపై ద్వేషం వ్యాపించకుండా చూసుకోవడం తన బాధ్యత అన్నారు. అభిమానులకు కలిగిన ఇబ్బందికి ఎంపురాన్ చిత్ర బృందం తరఫున క్షమాపణలు కోరుతున్నానన్నారు. అయితే, ఎంపురాన్ సినిమాలో 17 కట్స్ చేయాలని.. కొన్ని డైలాగ్స్‌ను కూడా మ్యూట్‌గా చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. మూవీ నిర్మాత గోకులం గోపాల్ మాట్లాడుతూ కొన్ని పదాలను మ్యూట్ చేశామని.. సినిమాలో చూపించిన కొన్ని విషయాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని.. అందులో ఏవైనా మార్పులు చేయగలరా? అని దర్శకుడిని అడిగానని.. సినిమా సెన్సార్ అయినప్పుడు ఎలాంటి సమస్య తెలిపారన్నారు. మార్చి 27న విడుదలైన ఎల్2 ఎంపునరాన్ చిత్రం గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సంఘటనలను పరోక్షంగా చూపించారని విమర్శించారు. ఈ మూవీ కేరళలోనే 4500 స్క్రీన్లలో 746 స్క్రీన్లలో విడుదలైంది. కలెక్షన్ల పరంగా మూవీ దూసుకెళ్తున్నది.