Kushboo | చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ప్రాంగణం సోమవారం పూల పరిమళాలతో, సంబురాలతో కోలాహలంగా మారింది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పూలతో అలంకరించిన బతుకమ్మను ఆమె భక్తిశ్రద్ధలతో ఎత్తుకొని, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఖుష్బూ మాత్రమే కాకుండా, కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి మరియు పలువురు మహిళా నేతలు హాజరయ్యారు.
చార్మినార్ చుట్టూ బతుకమ్మ ఆట పాటలతో సందడి వాతావరణం ఏర్పడింది. ఖుష్భూ సహా మహిళా నేతలందరూ సంప్రదాయ నృత్యంతో బతుకమ్మ ఆడుతూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, సినిమాల్లో డ్యాన్స్ చేయాలంటే కొరియోగ్రాఫర్ చెబుతాడు. కానీ ఇక్కడ మహిళలు తాము గానం చేస్తూ ఆడిపాడుతున్నారు. ఇది నిజంగా గొప్ప అనుభూతి అని చెప్పారు. తనను కూడా ప్రేమతో ఆహ్వానించినందుకు తెలంగాణ మహిళలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ వేడుకలు మహిళల ఐక్యతను, భక్తిని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె కొనియాడారు.
చార్మినార్ ప్రాంతంలో జరిగిన ఈ ఉత్సవం స్థానికుల నుంచి, సందర్శకుల నుంచి విశేష స్పందనను సంపాదించింది. చార్మినార్ వంటి చారిత్రక స్థలంలో బతుకమ్మ పూలతో అలంకరించబడిన దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది. మొత్తానికి… బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఖుష్భూ పాల్గొనడం, చార్మినార్ ప్రాంతం బతుకమ్మలతో కళకళలాడటం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఖుష్బూ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ పలు టీవీ షోలోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా జబర్ధస్త్ షోలో ఎంతో సందడి చేస్తుంది.
Participating in #Bathukamma celebrations at #BhagyalakshmiTemple by the Charminar is @khushsundar, VP of @BJP4TamilNadu; police had disallowed citing law&order concerns but #TelanganaHC allowed @BJP4Telangana event with only for 100 women, no VIP invites or provocative speeches pic.twitter.com/NKyc0wg4Yu
— Uma Sudhir (@umasudhir) September 23, 2025