కుశలవ్, తన్మయి జంటగా ‘మయూఖం’ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. వెంకట్ బులెమోని దర్శకుడు. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇదని, ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశానని, దీనినొక ఫ్రాంచైజీలా, ఒక యూనివర్స్‌లా క్రియేట్ చేయబోతున్నామని, వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదేనని, వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సత్యరాజ్, సత్యప్రకాశ్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, సంగీతం: ఆర్ ఆర్ ధృవ.