Kuberaa Movie Making Video | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. నాగార్జున, జిమ్ సర్భ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ లభించినట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల మార్క్, స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్లు సినిమా విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్రయూనిట్ కుబేర మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోలో ముంబై స్లమ్ ఏరియాతో పాటు బిచ్చగాడిగా ధనుష్ ఎలా నటించాడో చూయించారు మేకర్స్. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరు చూసేయండి.
Read More