Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే బాలీవుడ్ ప్రముఖుల కోసం గురువారం సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షోను ముంబైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు మేకర్స్. ఈ షోకి బాలీవుడ్ అగ్ర నటులు షారుఖ్‌తో పాటు సల్మాన్ ఖాన్, రేఖ, విక్కీ కౌశల్, తమన్నా, జెనీలియా, పాతాల్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్, అలీ ఫజల్, హిమేష్ రేష్మియా, కృతి కర్బందా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్, అశుతోష్ గోవారికర్, జాకీ ష్రాఫ్ తదితరులు ఈ ప్రీమియర్‌కి వచ్చి సందడి చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read More