Kubera Movie | తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు.
అయితే నేడు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా కుబేరా టీం విషెస్ తెలుపుతూ.. కుబేర మూవీ నుంచి నాగార్జున కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో హ్యాపీ బర్త్‌డే కింగ్ అంటూ చిత్రబృందం రాసుకోచ్చింది. ఈ పోస్టర్ చూస్తే.. కింగ్ ఎవరికో హైఫై ఇస్తున్నట్లుగా పోస్టర్ ఉంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు.
Celebrating the birthday of the one and only KING @iamnagarjuna sir, who will mesmerize you with his cinematic brilliance. 💥
Team – #SekharKammulasKubera! #HBDKingNagarjuna@dhanushkraja @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/b39gjmnOuQ
— Kubera Movie (@KuberaTheMovie) August 29, 2024
Also Read..