Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas) నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కృతి సనన్ (Kriti Sanon), ఓం రౌత్ శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జీఎస్టీతో కలిసి రూ.185 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో బిజినెస్ జరిగిన సినిమా ఇదే. పైగా కేవలం ప్రభాస్ బ్రాండ్ నేమ్ తోనే ఈ రేంజ్ లో ప్రీ బిజినెస్ జరిగింది.
Actress #KritiSanon and Director #OmRaut visited #Tirumala this morning to seek blessings.#Adipurush #AdipurushOnJune16th#ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qXs4IJGqni
— Shreyas Media (@shreyasgroup) June 7, 2023
Also Read..
Prabhas | పెళ్లి గురించి హింట్ ఇచ్చిన ప్రభాస్.. అక్కడే చేసుకుంటానంటూ డార్లింగ్ క్లారిటీ..!
Tractor Crushes Car | కారుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. షాకింగ్ వీడియో