Prabhas | పెళ్లి గురించి హింట్ ఇచ్చిన ప్రభాస్.. అక్కడే చేసుకుంటానంటూ డార్లింగ్ క్లారిటీ..!
Adipurush Pre-Release Event | నాలుగు పదుల వయసు దాటినా ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటూ.. పలువురు యువ హీరోలకు పెళ్లి ప్రశ్నలు తప్పించుకోవడానికి ఒక సాకుగా నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న ఓ రియాల్టీషోలో శర్వానంద్ ను పెళ్లి గురించి అడిగితే.. ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటా అని అన్నాడు.
Adipurush Pre-Release Event | నాలుగు పదుల వయసు దాటినా ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటూ.. పలువురు యువ హీరోలకు పెళ్లి ప్రశ్నలు తప్పించుకోవడానికి ఒక సాకుగా నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న ఓ రియాల్టీషోలో శర్వానంద్ ను పెళ్లి గురించి అడిగితే.. ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటా అని అన్నాడు. శర్వాతో పాటు పలు యంగ్ హీరోలు ప్రభాస్ నే ఆదర్శంగా తీసుకుంటున్నాము అంటూ పెళ్లి వార్తలను గండి కొడుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ అడిగితే.. తాను సల్మాన్ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటా అంటూ చమత్కారం కూడా చేశాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో పెళ్లి గురించి మాట్లాడాడు.
ఆదిపురుష్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ పెళ్లి.. పెళ్లి అని గోల చేశారు. దానికి ప్రభాస్ స్పందించి..పెళ్లా..? పెళ్లి గనుక చేసుకొంటే ఇక్కడే.. ఈ తిరుపతిలోనే చేసుకొంటా అంటూ చెప్పాడు. ఇక ఇలానే ప్రతీసారి ప్రభాస్ పెళ్లి వార్తలపై ఫన్నీగా చెబుతుంటాడు. ఇక గతంలో ప్రభాస్, అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని.. ఇరు కుటుంబ సభ్యులు వీళ్ల పెళ్లికి అంగీకరించారని బోలెడన్ని వార్తలు వచ్చాయి. వాటిపై ఆ ఇద్దరూ స్పందించి.. అవన్నీ అవాస్తవమని, తాము కేవలం ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఐదారు నెలల క్రితం ఆదిపురుష్ సినిమాతో కృతిసనన్, ప్రభాస్ ప్రేమలో పడ్డారని, సీక్రెట్ రిలేషన్ షిప్ మేయింటేన్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. అవన్నీ అవాస్తవమేనని కుయ్యో, మొర్రో అని మొత్తుకున్నా ఇప్పటికీ వీరికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అంతేకాకుండా ఓ షోలో వరుణ్ ధావన్, కృతి మనసులో సౌత్ హీరో ఉన్నాడని చెప్పి ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాడు. దాంతో పెళ్లి వార్తలు తెగ వైరల్ అయిపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

