Amma Nee Charithamu | మూడు దశాబ్ధాలకుపైగా సినీ ప్రయాణంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కల్యాణ్‌తోపాటు చాలా మంది హీరోలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ కోటి (Koti). ఈ సీనియర్ కంపోజర్ 2022లో వచ్చిన సెహరి, పగ పగ పగ సినిమాలతో నటుడిగా కూడా మారాడని తెలిసిందే. తాజాగా కోటి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై వాసవి సాక్షాత్కరం ఆల్బమ్‌ను రూపొందించాడు .
ఈ ఆల్బమ్ నుంచి పాపులర్ సింగర్ కైలాష్ ఖేర్ పాడిన అమ్మా నీ చరితం (Amma Nee Charithamu) వీడియో సాంగ్‌ను లాంచ్ చేయగా.. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. వాసవి సాక్షాత్కారం ఆల్బమ్‌పై పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కోటి అన్నాడు. ఈ ఆల్బమ్ కోసం మేము ఆరు నెలలు కష్టపడ్డాము. ప్రతి పాటను భక్తితో చాలా జాగ్రత్తగా రూపొందించాన్నాడు కోటి . వేదం షణ్ముక శర్మ రాసిన ఈ పాటను కోటి-కైలాష్ ఖేర్ పాడారు.
The #VasaviSakshathkaram album by Music Director #Koti beautifully captures the greatness, values, and sacrifices of Vasavi Matha
With its fusion music, it resonates across generations, making her significance timeless and universally understood#AmmaNeeCharithamu Video Song… pic.twitter.com/AgldY1ZFQf
— Ramesh Bala (@rameshlaus) January 28, 2025
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్