కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం ‘కోస్టి’. కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ కామెడీ చిత్రమిది. తండ్రీకూతురు మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులో కాజల్ అగర్వాల్ లేడీ ఇన్స్పెక్టర్ ఆరతి పాత్రలో కనిపిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ దాస్‌ను పట్టుకుంటానని ఆమె శపథం చేస్తుంది.
ఈ క్రమంలో ఏం జరిగిందన్నదే చిత్ర కథాంశం. గ్యాంగ్‌స్టర్ పాత్రలో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ నటించారు. హారర్ కామెడీతో పాటు ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలుంటాయి’ అన్నారు. రాధిక శరత్‌కుమార్, యోగిబాబు, మనోబాల తదితరులు ఈ చిత్రంలో నటించారు.