సాధారణంగా మాస్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అంటే ఫైట్‌తోనే ఎక్కువ ఉంటుంది. ఆ ఫైట్‌పై అభిమానులు కూడా చాలా భారీ అంచనాలే పెట్టుకుంటారు. అందుకే దర్శకులకు ఈ తరహా ఫైట్ అంటే పెద్ద టాస్క్. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఈ విషయంపైనే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తారక్‌తో ఆయన చేస్తున్న ‘దేవర’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ప్రస్తుతం తారక్‌పై పీటర్హెయిన్స్ నేతృత్వంలో ఇంట్రడక్షన్ ఫైట్‌ని చిత్రీకరిస్తున్నారు.
ఈ ఫైట్‌ని కొత్తగా డిజైన్ చేశారట కొరటాల శివ. సముద్రంలో జరిగే ఈ ఫైట్‌లో తిమింగళాల గుంపు మధ్యలోనుంచి తారక్ ఎంట్రీని డిజైన్ చేశారట కొరటాల. సాధ్యమైనంతవరకూ గ్రీన్మ్యాట్లోనే ఈ తరహా ఫైట్లు తీస్తారన్న విషయం తెలిసిందే. తెరపై మాత్రం ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారని సమాచారం. తారక్‌తో పాటు హీరో శ్రీకాంత్ కూడా ఈ ఫైట్‌లో ఉంటారట. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. జాన్వికపూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.