Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో దేవర సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న సీక్వెల్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కొరటాల శివ. తాజాగా ఈ క్రేజీ డైరెక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
దేవర పార్ట్ 2 లైన్లో ఉండగానే.. మరో యువ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట కొరటాల. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌటు. అతడే అక్కినేని నాగచైతన్య. తండేల్ సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు చైతూ. ఇటీవలే నాగచైతన్యకు కొరటాల శివ ఓ ఆసక్తికర మాస్ డ్రామా స్క్రిప్ట్‌ను వివరించాడట. కథకు ఇంప్రెస్ అయిన చైతూ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
మొత్తానికి ఈ క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసే విషయంపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. కొరటాల శివ సినిమా అంటే ఏదో ఒక కీలకమైన సందేశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాస్ డ్రామా ప్రాజెక్ట్‌తో ఎలాంటి సందేశాన్నివ్వబోతున్నాడో చూడాలి. రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Aamir Khan | ‘కూలీ’ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Javed Akhtar | దేశద్రోహి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జావేద్ అక్తర్
Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్