Konda Surekha | అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి.
అయితే కొండా చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ గత శుక్రవారం విచారణకు రాగా.. నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో కేసును వాయిదా వేస్తూ.. సోమవారం విచారణ చేపట్టనున్నట్లు మనోరంజన్ కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక సోమవారం ఈ పిటిషన్ మనోరంజన్ కోర్టులో విచారణకు రాగా.. నాగార్జున లేకపోవడంతో పిటిషన్ను మంగళవారంకు వాయిదా వేసింది. అలాగే రేపు కోర్టుకు హీరో నాగార్జున హాజరు కానుండగా.. అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది కోర్టును కోరాడు. దీంతో దీనిపై సముఖత వ్యక్తం చేసిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.