Konda Polam | అఖిల్ కోసం రిలీజ్ డేట్ త్యాగం చేసిన మెగా మేనల్లుడు..

Konda Polam | కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో ఒక్క సినిమా విడుదల చేయడానికే నానా తంటాలు పడుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సమయంలో ఒకేసారి రెండు సినిమాలు ఒకే రోజు పోటీ పడటం అనేది ఎవరికీ మంచిది కాదు. అందులోనూ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు వస్తే కచ్చితంగా కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుంది. అందుకే దీనిపై నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయడం ఎవరికీ మంచిది కాదు అంటూ వాళ్లకు వాళ్లు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోలు కూర్చొని కాంప్రమైజ్ అయ్యారు. వీరిలో ఒకరు అక్కినేని హీరో అయితే.. మరొకరు మెగా హీరో కావడం విశేషం.

అక్టోబర్ 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోంది. వాసు వర్మ, బన్నీవాసు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచి అంచనాలతోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మరో సినిమాను వాయిదా వేశారు. ఉప్పెన సినిమాతో ఈ ఏడాది అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం.. అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదేరోజు వస్తుండటంతో వైష్ణవ్ కాంప్రమైజ్ అయ్యాడు. ఈయన సినిమా మరో రోజు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. కేవలం 40 రోజుల్లోనే కొండపొలం సినిమా పూర్తిచేశాడు క్రిష్. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే.. మరోవైపు వైష్ణవ్ తేజ్ సినిమా కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాను దసరా బరి నుంచి తప్పించి.. నవంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కేవలం అఖిల్ సినిమా కోసమే మెగాహీరో సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఇద్దరికీ నష్టం తప్పదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | వాణి విశ్వనాథ్ కూతురితో కోటి కొడుకు సినిమా
మాల్దీవుల్లో అవికాగోర్ అందాల కనువిందు..వీడియో హల్చల్
Lahari: దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీరామ్- లహరి
Ntr: కారు నెంబర్ కోసం తారక్ అంత ఖర్చు పెట్టాడా..!
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

