బిగ్ బాస్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయి – అమెరికా అబ్బాయి టాస్క్చాలా ఆసక్తికరంగా సాగింది. టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్, లోబో.. శ్వేతతో పులిహోర కలపడం మొదలు పెట్టారు. శ్వేతతో క్లోజ్‌గా ఉన్న లోబోని చూసి షణ్ముఖ్ సెటైర్ వేశాడు. శ్వేత ఏదో విషయంలో ఫీల్ కావడంతో ఈ చిన్న విషయానికి కూడా ఫీల్ కావడం ఎందుకు అంటూ లోబో అసహనం వ్యక్తం చేశాడు. ఇక తన ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారంటూ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో లహరి,శ్రీరామ్ పెళ్లి చేశారు. ఇద్దరు దండలు మార్చుకొని రింగులు తొడుక్కున్నారు. వేడుకలో భాగంగా టాస్క్ ముగిసినట్టు బిగ్ బాస్ చెప్పడంతో అందరు మళ్లీ రొటీన్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ప్రియ లేకపోతే గేమ్ ఆడలేనేమో అని అనిపిస్తుంది అంటూ పింకీ పేర్కొంది.
ఇక శ్రీరామ్, జెస్సీ అటూ ఇటూ మాట్లాడతాడని అనిపిస్తారని, అబ్బాయిలలో రవి అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేస్తాడని హమీదా అభిప్రాయపడింది. ఇలా బుధవారం ఎపిసోడ్ సాగింది. ఇక నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుండగా, ఈ టాస్క్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాడు.