ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేస్తున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ( Ram ). రామ్ 19వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ మేకర్స్ స్పెషల్ అనౌన్స్ మెంట్ చేశారు. ప్రముఖ తమిళ హీరోయిన్ అక్షర గౌడ (Akshara Gowda) ను ఈ మూవీలో కీ రోల్ కోసం ఎంపిక చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ తో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ 19 టీంలోకి టాలెంటెడ్ నటి అక్షర గౌడ అంటూ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ తో తొలిసారి తెలుగు సినిమాలో కనిపించింది అక్షరగౌడ. తుపాకి, ఆరంభం, మాయావన్ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించింది అక్షర గౌడ. ప్రస్తుతం సూర్పనగై అనే తెలుగు, తమిళ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది.
Talented Actress @iAksharaGowda Onboard for #RAPO19 @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli @DoneChannel1 pic.twitter.com/2LL0l1SsZV
— Ramesh Bala (@rameshlaus) July 31, 2021
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..