Siva Karthikeyan New Movie Title | తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ తదుపరి సినిమా టైటిల్ తాజాగా విడుదలైంది.
శివకార్తికేయన్ తన తదుపరి చిత్రాన్ని మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేష్‌బాబు రివీల్ చేస్తూ టైటిల్ వీడియోను విడుదల చేశాడు. ఈ చిత్రానికి తెలుగులో ‘మహావీరుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.లేటెస్ట్గా విడుదలైన టైటిల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శాంతీ టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భరత్ శంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫి విధు అయ్యన్న, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్.
Happy to unveil the title of @Siva_Kartikeyan's #Maaveeran! Best wishes to the entire team!https://t.co/oU2aWLt0mE#Mahaveerudu @madonneashwin @ShanthiTalkies @iamarunviswa @bharathsankar12 @vidhu_ayyanna @philoedit
— Mahesh Babu (@urstrulyMahesh) July 15, 2022
Read Also:
Kiran Abbavaram | ‘మీటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. మాస్‌లుక్‌లో కిరణ్ అబ్బవరం
Pratap Pothen | ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు పోతెన్ మృతి
Nani | నాని ‘దసర’ మూవీ విడుదలయ్యేది అప్పుడేనట?