Kiran Abbavaram | ‘మీటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. మాస్‌లుక్‌లో కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram Meter First Look Poster | ఫలితం ఎలా ఉన్నా వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి న ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచిన ఇటీవలే వచ్చిన ‘సమ్మతమే’ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘మీటర్’ ఒకటి. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. శుక్రవారం కిరణ్ అబ్బవరం బర్త్‌డే సందర్భంగా ‘మీటర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో కిరణ్ మాస్ లుక్‌లో ఉన్నాడు. చిత్రంలో వచ్చే డ్యాన్స్ స్టిల్లా పోస్టర్ ఉంది. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు టాక్. అతుల్య రవి ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. సూర్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. సాయి కార్తిక్ స్వరాలని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’, ‘రూల్స్ రంజన్’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు.
Here's @Kiran_Abbavaram Mass Look from #Meter ❤️🔥
Get ready for Immeasurable Entertainment 🔥
▶️ https://t.co/xZFvvnpyIQ#HBDKiranAbbavaram#RameshKaduri @AthulyaOfficial #SaiKartheek #VenkatCDileep @ClapEntrtmnt @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/YAqbRnH5le
— Clap Entertainment (@ClapEntrtmnt) July 15, 2022
Read Also:
Pratap Pothen | ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు పోతెన్ మృతి
Nani | నాని ‘దసర’ మూవీ విడుదలయ్యేది అప్పుడేనట?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

