నరేష్ ఆగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కిస్మత్’. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రమిది.
చిన్ననాటి మిత్రులైన ముగ్గురు యువకుల జీవితం చుట్టూ కథ నడుస్తుంది. వారి జీవితాల్లో ఎదురైన అనూహ్య పరిణామాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. న్యూఏజ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్, నిర్మాత: రాజు, దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని.