చూస్తుండగానే కిరణ్ అబ్బవరం నటించిన SR కళ్యాణమండపం వచ్చి రెండు వారాలు అయిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత తొలి సూపర్ హిట్ ఇదే. చెప్పి మరీ కొట్టాడు ఈ కుర్రాడు అంటూ చాలా మంది కిరణ్‌ను ఆకాశానికి ఎత్తేశారు కూడా. ఆగస్ట్ 6న విడుదలైన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత థియేటర్స్‌లో హౌజ్ ఫుల్ బోర్డులు పడేలా చేసింది. సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం సెకండ్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్‌గానే ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. 14 రోజుల్లో దాదాపు 8.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చాలా రోజుల తర్వాత బయ్యర్ల మొహాల్లో సంతోషం నింపింది ఈ చిత్రం. మరి 2 వీక్స్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..
నైజాం: 2.94 కోట్లు
సీడెడ్: 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు
ఈస్ట్: 0.51 కోట్లు
వెస్ట్: 0.35 కోట్లు
గుంటూరు: 0.69 కోట్లు
కృష్ణా: 0.42 కోట్లు
నెల్లూరు: 0.25 కోట్లు
ఏపీ + తెలంగాణ: 7.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.70 కోట్లు
వరల్డ్ వైడ్: 8.31 కోట్లు
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రూ 4.55 కోట్లకు అమ్మారు. కొత్త హీరోకు ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది విమర్శించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ వైపు కూడా ప్రేక్షకులు రారు అంటూ డిసప్పాయింట్ చేశారు. కానీ ఇప్పుడు రెండింతల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. SR కళ్యాణమండపం సినిమాతో చాలా నెలల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. పెట్టిన రేటు కంటే డబుల్ వచ్చింది ఈ చిత్రానికి. రెండు వారాలు పూర్తి కావడంతో చాలా చోట్ల సినిమా ఫైనల్ రన్ అయిపోయినట్లే. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు కూడా థియేటర్స్‌లో విడుదలకాబోతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?