Kiran Abbavaram KA Movie | యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘క’ (KA). ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా మూవీ నుంచి కథానాయికను పరిచయం చేశారు.
ఈ సినిమాలో ఆయ్ చిత్రం ఫేం నయన్ సారిక సత్యభామ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో నయన్ సారిక రొకలిని తిప్పుతూ.. అచ్చ తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మాన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
#KA – Nayan Sarika – First Look pic.twitter.com/LkateR1dpp
— Aakashavaani (@TheAakashavaani) August 18, 2024
Also Read..