Kim kardashian | అమెరికన్ బిజినెస్ ఉమెన్, సోషల్ మీడియా సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ తన మాజీ భర్త, ప్రముఖ ర్యాప్ గాయకుడు కెన్యే వెస్ట్‌కి విడాకులు ఇచ్చిన కారణాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ఆసక్తికరంగా వెల్లడించారు. “అతను ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాడు… అలాంటి పరిస్థితుల్లో మానసికంగా కలిసి జీవించడం అసాధ్యమైంది” అంటూ ఆమె స్పష్టం చేశారు. “బాత్రూమ్ అయినా, రెస్టారెంట్ అయినా, హోటల్ అయినా, అతను కూచునే చోటే నిద్రించేస్తాడు. నాకు మూడ్ ఉన్న సమయంలో కూడా అతడికి నిద్ర వస్తుంది. స్నేహితులు ఇంటికి వచ్చినా, మీటింగ్‌ల మధ్యలోనూ, ట్రిప్లలోనూ గురక పెట్టడం వల్ల నాకు చాలా అసహనంగా ఉంటుంది అని కిమ్ పేర్కొన్నారు.ఇంకా జనరేటర్‌లా సౌండ్ చేస్తూ నిద్ర పోతుంటాడని ఆమె చెప్పడం విశేషం.
కెన్యే వెస్ట్ కి ఎక్కువగా నిద్ర పోయే అలవాటు ఉన్న కారణంగా తమ దాంపత్య జీవితం దెబ్బతిందని అర్ధమవుతుంది. “ఒక్కోసారి రెస్టారెంట్లో కూడా అతను గురక పెట్టేవాడు. జనరేటర్‌లా శబ్దం చేయడం వల్ల బోలెడంత ఎంబారసింగ్‌గా ఫీలయ్యేదాన్ని అని కిమ్ చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌లో జరిగిన అత్యంత వైభవంగా నిలిచిన అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకకు కిమ్ కర్దాషియన్, ఆమె సోదరి కోలే కర్దాషియన్ హాజరైన విషయం తెలిసిందే. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ మెరిసిపోయారు. ఈ వేడుకలో కిమ్ తన ఖరీదైన బంగారు ఆభరణాలను కోల్పోయిందని వచ్చిన వార్తలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
అయితే, కిమ్ తన మాజీ భర్తపై వ్యక్తిగత విమర్శలు చేసినా, చివరిలో “కెన్యే వెస్ట్ చాలా మంచి వాడు” అంటూ పాజిటివ్ గానే చెప్పడం గమనర్హం. గతంలో వీరిద్దరూ మీడియా హెడ్లైన్లలో ఎక్కువగా నిలిచే వారు. అన్యోన్య దంపతులుగా విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. కాని నిద్ర వలన కిమ్ తన భర్తకి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై నెటిజన్స్ కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.