Kiara Advani Hospitalised | బాలీవుడ్ నటి కియారా అద్వానీ అనారోగ్యం కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో చేరినట్లు ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను ఆమె ప్రతినిధి ఖండించారు. కియారా అద్వానీ ఏ ఆసుపత్రిలో చేరలేదని.. ఆమె ఆరోగ్యంగానే ఉందని బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుందని అంతే తప్ప సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఫేక్ అని తెలిపారు.
కియారా అద్వానీ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా.. నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 3 ఏండ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది కియారా. రీసెంట్గా ఆరోగ్యం బాలేక గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్‌కి కూడా రాలేదు ఈ అమ్మడు. ముంబై ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, నాజర్, ప్రకాష్ రాజ్, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..