AP News | ఏపీలో అరుదైన శ్వేతనాగు కనిపించింది. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలంలోని ఓ ఇంటి ఆవరణలోని తులసి మొక్కపై ఈ శ్వేతనాగు దర్శనమిచ్చింది. ఈ విషయం తెలియగానే ఆ గ్రామ మహిళలంతా ఆ ఇంటికి చేరుకుని ఆ పాముకు పాలను నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఈపురుపాలెంలోని ఓ ఇంటి ఆవరణలోని తులసి మొక్కపై శనివారం ఉదయం తెలుపు వర్ణంలోని ఓ పాము కనిపించింది. దీంతో ఆమె భక్తి పారవశ్యంతో ఆ పాముకు పూజలు చేసింది. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారితో పాటు ఆ గ్రామంలోని మహిళలంతా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. ఆ శ్వేతనాగుకు పాలు పోసి, పూజలు చేశారు. భారీగా ప్రజలు తరలివచ్చి శ్వేతనాగుకు పూజలు చేస్తున్నప్పటికీ అది అక్కడి నుంచి ఎటు వెళ్లకపోవడం.. ఎవరికీ హాని చేయకపోవడం మహత్మ్యం.
బాపట్ల జిల్లా చీరాల మండలంలో శ్వేత నాగు ప్రత్యక్షం
ఈపూరుపాలెంలోని ఓ ఇంట్లో ఉన్న తులసి చెట్టు వద్ద కనిపించిన శ్వేత నాగు
పామును నాగ దేవతగా భావించి పూజలు చేస్తున్న ప్రజలు pic.twitter.com/YgX3tLRj8B
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025
మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేతనాగు తమ ఇంట్లో ప్రత్యక్షం కావడంపై ఆ ఇంట్లోని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమపై ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తమ గ్రామంలో నాగ దేవత వెలిసిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.