Wimbledon | ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ (Wimbledon)లో బాలీవుడ్ స్టార్ కపుల్స్(Bollywood Star Couples) సిద్ధార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani) సందడి చేశారు. లండన్ వేదికగా ప్రస్తుతం గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 1 మొదలై జూలై 14వ తేదీన ముగుస్తుంది. ఇక ఈ వింబుల్డన్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్, బ్రిటన్ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హమ్ తదితరులు ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి హాజరై వింబుల్డన్ సెంట్రల్ కోర్టులో మ్యాచ్‌ను వీక్షించారు.
ఇదిలావుంటే తాజాగా వింబుల్డన్ మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సందడి చేసింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
.@SidMalhotra & @advani_kiara represent India on the global stage at #Wimbledon2024! 😍❤️#SidharthMalhotra #SidKiara #KiaraAdvani #Wimbledon #Tennis #TeamSidharthMalhotra #Sidians pic.twitter.com/6diTlcIWj4
— Team Sidharth (@Team_SidharthM) July 9, 2024
We just can’t get over this ‘MATCH’! 😍❤️#SidharthMalhotra #SidKiara #KiaraAdvani #Wimbledon #Wimbledon2024 #TeamSidharthMalhotra #Sidians pic.twitter.com/aZVOJ73log
— Team Sidharth (@Team_SidharthM) July 10, 2024
ఇక వింబుల్డన్ టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన ప్రపంచ మొదటి ర్యాంకర్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) ఈ టోర్నీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. మంగళవారం సెంటర్ కోర్టు వేదికగా జరిగిన క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్ 7-6 (9/7), 4-6, 6-7 (4/7), 6-2, 3-6తో డేనిల్ మెద్వెదెవ్ (రష్యా) చేతిలో ఓడాడు. సుమారు 4 గంటల పాటు 5 సెట్లలో హోరాహోరీగా పోరాడినా ఇటలీ కుర్రాడికి ఓటమి తప్పలేదు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో సెర్బియన్ స్టార్ నోవాక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో హోల్గర్ రునె (డెన్మార్క్)ను వరుస సెట్లలో ఓడించి ఈ టోర్నీలో 15వ సారి క్వార్టర్స్ చేరాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో వెకిచ్ 5-7, 6-4, 6-1తో సున్ను ఓడించి వింబుల్డన్‌లో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది.
Also Read..