Hombale Films | ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో ‘పాన్ ఇండియా’ స్థాయిలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమోగుతోంది. కె.జి.యఫ్తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ తాజాగా కాంతారతో మరో బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ సంస్థ విజయ్ కిరంగదుర్చే స్థాపించబడి కేవలం ప్రాంతీయ చిత్రాలకే పరిమితం కాకుండా భారీ బడ్జెట్‌తో పకడ్బందీ కథనాలతో సినిమాలు తీస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. 100 శాతం సక్సెస్ రేట్‌తో ఇండియాలో టాప్ బ్యానర్‌గా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్లో వచ్చిన కేజియఫ్ సినిమాతో హోంబలే పేరు ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన కేజియఫ్ పార్ట్ 2తో కన్నడ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది. ముఖ్యంగా ‘KGF-2’ 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. అనంతరం కాంతరతో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమాతో కూడా హోంబలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి హోంబలే విజయాల పరంపరను కొనసాగించింది. సలార్ చిత్రం దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ రీసెంట్గా ఈ బ్యానర్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాఫ్టర్ 1. దసరా కానుకగా అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే కాకుండా రీసెంట్గా వచ్చిన మహావతార్ సినిమా హోంబలే ఫిలిమ్స్ సమర్పణలోనే విడుదలైంది. దీంతో హోంబలే సినిమాలు నిర్మిస్తే.. ఆ సినిమా కచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు.