గురువారం 28 మే 2020
Cinema - May 13, 2020 , 09:08:09

బుట్ట‌బొమ్మ సాంగ్‌కి కెవిన్ పీట‌ర్స‌న్ స్టెప్పులు

బుట్ట‌బొమ్మ సాంగ్‌కి కెవిన్ పీట‌ర్స‌న్ స్టెప్పులు

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని ‌ బుట్ట బొమ్మ సాంగ్ కోసం  కోసం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన బాణీలు శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సంగీతంతో పాటు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ కూడా ఈ పాట‌ని ఖండాలు దాటేలే చేసింది. బుట్ట‌బొమ్మ సాంగ్‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు క్రికెట‌ర్స్ కూడా స్టెప్పులేస్తున్నారు. ఇటీవ‌ల ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న ఫ్యామిలీతో క‌లిసి చిందులు వేయ‌గా, తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేశారు.

కెవిన్ పీట‌ర్స‌న్ కొద్ది రోజులుగా టిక్ టాక్‌లో అనేక వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే కెవిన్‌కి సంబంధించిన చాలా వీడియోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా బుట్ట‌బొమ్మ సాంగ్‌కి హుక్ స్టెప్స్ వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. నా డ్యాన్స్ మెరుగుప‌డుతుందా అంటూ వీడియోకి కామెంట్ కూడా ఇచ్చాడు. ట‌వ‌ల్ క‌ట్టి కెవిన్ వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బుట్ట‌బొమ్మ సాంగ్ ఇటీవ‌ల 150 మిలియ‌న్స్‌‌కి పైగా వ్యూస్‌ని క్రాస్ చేసిన విష‌యం తెలిసిందే.


logo