టాలీవుడ్ (Tollywood) హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో కలిసి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తిసురేశ్. పరశురాం (Parasuram) దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న రిలీజై మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. ఇక ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా యాక్టింగ్‌లో కూడా మహేశ్‌తో పోటీపడి నటించిందంటున్నారు సినీ జనాలు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కీర్తిసురేశ్ తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ ను పూర్తిగా బయటపెట్టిందంటున్నారు మూవీ లవర్స్.
కీర్తిసురేశ్ ఇన్ స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నది. ఈ సెషన్లో ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా తన ఫేవరేట్ సాంగ్ ఏంటో చెప్పింది. అంతేకాదు ఆ అభిమాని ఆ పాట కూడా పాడి సందడి చేసింది. ఇంతకీ ఈ పాట ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. సర్కారు వారి పాటలో వచ్చే ఊరమాస్ బీట్ సాంగ్ మ మ మహేశా (Ma Ma Mahesha song). శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేశ్, కీర్తిసురేశ్ ఇరగదీసే డ్యాన్స్ తో అదరగొట్టేశారు.
కీర్తిసురేశ్ మల్టీపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమా చేస్తోంది. మరోవైపు మెగాస్టార్ లీడ్ రోల్ చేస్తున్న భోళా శంకర్‌లో చిరుకు సోదరిగా నటిస్తోంది. మలయాళంలో వాశి అనే సినిమాలో కూడా నటిస్తోంది.