Keerthy Suresh | ప్రస్తుతం దక్షిణాదిన వరుస విజయాలతో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. తెలుగులో ‘దసరా’, తమిళంలో ‘మామన్నన్’ చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతున్నది. తమిళ చిత్రం ‘తేరి’ హిందీ రీమేక్‌లో ఆమె వరుణ్‌ధావన్ సరసన నటించనుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికాన్ని భారీగా పెంచిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
‘తేరి’ రీమేక్ కోసం ఈ సొగసరి మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందని తెలిసింది. ఇక ముందు దక్షిణాది చిత్రాలకు కూడా ఇదే రెమ్యునరేషన్ డిమాండ్ చేయబోతున్నదని చెబుతున్నారు. ఇటు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మహిళా ప్రధాన కథాంశాల్ని ఎంచుకొని కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నది. తమిళంలో సైరన్, రఘుతాథ, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది