Keerthy Suresh Good Luck Sakhi Trailer | కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో క్రీడా నేపథ్యంలో రూపొందిన చిత్రం గుడ్ లక్ సఖి. నగేశ్ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. రిలీజ్ డేట్‌ను కూడా చెప్పేసింది.
జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను కీర్తి సురేశ్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. దీంతో పాటు సినిమా రిలీజ్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి జాతీయస్థాయి షూటర్‌గా ఎలా మారిందనేది సినిమా కథాంశంగా తెలుస్తుంది. ఇందులో జగపతి బాబు కీర్తి సురేశ్ శిక్షకుడిగా కనిపిస్తున్నాడు. దేశం గర్వపడే షూటర్‌ను తయారుచేయబోతున్నాను అని జగపతి బాబు చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలై.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక నన్ను అందరూ బ్యాడ్‌లక్ సఖి అని అంటుంటారు.. మనకు అట్టాంటి సోది కబుర్లమీద నమ్మకం లేదంటూ కీర్తి సురేశ్ చెప్పే డైలాగులు మెప్పిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Keerthy Suresh New Talent | కొత్త టాలెంట్ చూపించబోతున్న కీర్తిసురేశ్..!
Keerthy Suresh | వెరైటీ చీరకట్టులో కీర్తి సురేష్ అదిరిపోయే ఫొటోషూట్..
Keerthy Suresh | కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేశ్..