Keerthy Suresh |హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తెగ ప్రచారం నడుస్తుంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో నేచురల్ యాక్టింగ్‌కు నిదర్శనంగా నిలిచిన హీరోయిన్ కీర్తి సురేష్ తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసిన అభిమానులు “TVK… TVK…” అంటూ నినాదాలు చేయడంతో, ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది.
TVK అంటే తలపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK). అభిమానులు కీర్తిని చూసిన వెంటనే TVK అంటూ నినాదాలు చేసారు. మరోవైపు ఆమె విజయ్ అభిమానిగా పలుమార్లు తన ప్రేమను వ్యక్తం చేయడం చూశాం. ఈ నేపథ్యంలో కీర్తి TVK తరపున 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురై నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కీర్తి సురేష్ , విజయ్ ఇద్దరు కలిసి ‘సర్కార్’, ‘భైరవ’ వంటి చిత్రాల్లో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమ ఉందంటూ పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఆ పెళ్లి తరువాత ఈ రూమర్స్‌కు చెక్ పడినప్పటికీ, విజయ్ రాజకీయ ఎంట్రీ నేపథ్యంలో మళ్లీ ఈ జంటపై చర్చలు మొదలయ్యాయి.
కీర్తి సురేష్ ఇటీవలి కాలంలో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య ఆమె చేసి ‘ఉప్పు కప్పురంబు ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే కీర్తి తన భర్త వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండేందుకు సినిమాలు తగ్గిస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాల్లోకి అడుగు పెడుతుందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. అయితే కీర్తి సురేష్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ , విజయ్ పార్టీ ప్రభావం ఆమెని తప్పక గెలిపిస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే తమిళ నాట జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవ ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది.