Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతకంత పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు ఇతను హీరో ఏంట్రా అని విమర్శించిన వారు ఇప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రోజురోజుకి బన్నీ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇటీవల వచ్చిన పుష్ప 2 చిత్రంతో బన్నీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప2 తర్వాత బన్నీ క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. సభలు, ఆటలు, ఈవెంట్స్ ఇలా ప్లేస్ ఏదైన సరే బన్నీ అభిమానులు ఆయన ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం మనకు తెలిసిందే
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. సభలో అల్లుఅర్జున్ ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశాయి. ఓ వైపు కేసీఆర్, మరోవైపు బన్నీ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్.. తగ్గేదేలేష అంటూ ఆ ఫ్లెక్సీలపై రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అల్లు అర్జున్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
ఇవి చూసిన అల్లు అర్జున్ అభిమానులు అది మన హీరో క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రాజెక్టు గురించి వార్తలు వస్తుండగా.. రీసెంట్ గా బన్నీ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. సన్ పిక్చర్స్ సంస్థ ఆ సినిమా విషయాలు పంచుకుంటూ వీడియో షేర్ చేసింది. వీడియో చూశాక ఈ మూవీ భారీ స్కేల్లో రూపొందుతుందని అందిరికి అర్ధమైంది.ఫ్యాన్స్ ఊహలకు అందని రీతిలో మూవీ ఉంటుందని తెలుస్తుంది.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు క్లియర్ గా అర్ధమవుతుంది.