Funky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ’. జాతిరత్నాలు ఫేం కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడని తెలిసిందే. టీజర్ సందడి చేయనున్న నేపథ్యంలో ఈ మూవీ నుంచి కయాదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ సూపర్ కూల్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇందులో ఈ భామ చిత్ర పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. అల్లూరి సినిమా తర్వాత కయాదు లోహర్ తెలుగులో చేస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ సినీ ఇండస్ట్రీపై సెటైరికల్‌గా తెరకెక్కుతుంది.
Tomorrow ✨ #Funky pic.twitter.com/g85YfCAj5k
— Kayadu Lohar (@KayaduLoharf) October 9, 2025
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్