Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau), ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ (Katy Perry) ప్రస్తుతం డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ జంట బయట కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఈ జంట మరోసారి కెమెరా కంటపడింది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో వీరిద్దరూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ జరిగిన ‘గ్లోబల్ సాఫ్ట్ పవర్ సమ్మిట్’లో జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా, కేటీ పెర్రీ అనూహ్యంగా ‘ఫీమేల్ కోషెంట్ లౌంజ్’ లోకి ప్రవేశించి ఆయనకు తన మద్దతును తెలిపారు. ట్రూడో వేదికపై నుంచి ప్రసంగిస్తూ కేటీ పెర్రీని చూసి కన్నుకొట్టగా, ప్రతిగా కేటీ కూడా ఆయనను చూస్తూ కన్నుకొట్టడం, చిరునవ్వులు చిందించడం వంటి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అద్భుతమైన కెమిస్ట్రీ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.