Rana Naidu Season 2 | నటులు దగ్గుబాటి వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన పాపులర్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. దీనికి తాజాగా సీజన్ 2 వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. కొత్త వీడియోను విడుదల చేసింది టీమ్. ఇందులో బాహుబాలి కట్టప్ప రానా నాయుడిని కలిసినట్లు ఈ వీడియోను పంచుకున్నారు.
ఫ్యామిలీ సమస్యలతో నిద్రలేక బాధపడుతున్న రానా నాయుడిని అర్థరాత్రి కలవడానికి వస్తాడు కట్టప్ప. అనంతరం మహిష్మతి పాలించిన మీరు ఇలా నిద్రలేకుండా సమస్యలు పడుతున్నారా అంటూ రానా నాయుడిని అడుగుతాడు కట్టప్ప. దీనికి రానా నాయుడు. మహిష్మతి రాజ్యంలో నేను ఏం చేసిన నడిచింది. ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్ని అందుకే ఈ సమస్యలు అని చెబుతాడు. చివరిగా వెబ్ సిరీస్ చూస్తున్న కట్టప్పను.. రానా అడుగుతూ.. అవును బాహుబలిని ఎందుకు చంపావు అంటాడు. దీనికి కట్టప్ప.. నువ్వే కదా చంపమని అడిగావు అంటూ ఫన్నీగా సమాధానమిస్తాడు..
Read More