సీనియర్ కథానాయిక కత్రినాకైఫ్ తాజా ప్రేమాయణం బాలీవుడ్ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది. యువహీరో విక్కీ కౌశల్‌తో ఈ ముద్దుగుమ్మ ఏడాది కాలంగా ప్రేమలో ఉందని తెలుస్తోంది. అయితే తమ బంధం గురించి ఈ జంట ఎక్కడా పెదవి విప్పలేదు. గత ఏడాది దీపావళి వేడుకల్లో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో ఈ జంట ప్రేమలో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆదివారం విక్కీకౌశల్ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా ప్రియుడికి శుభాకాంక్షలందజేస్తూ కత్రినాకైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేకమైన ఫొటోను పంచుకుంది. దేశ సరిహద్దులో విక్కీకౌశల్ ఆర్మీ జవాన్లతో కలిసి తీయించుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ ‘నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుల్ని చిందిస్తూ ఉండాలి’ అని వ్యాఖ్యానించింది కత్రినాకైఫ్. గతంలో సల్మాన్‌ఖాన్, రణభీర్కపూర్లతో ప్రేమ వ్యవహారాల్ని సాగించిన కత్రినాకైఫ్ మనస్పర్ధల కారణంగా వారితో బంధానికి వీడ్కోలు పలికింది. ఏడాది కాలంగా ఆమె విక్కీకౌశల్ ప్రేమలో ఉందని..గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తన ఎఫైర్‌పై కత్రినాకైఫ్ మౌనంగా ఉంటోందని అంటున్నారు.