‘టైగర్ 3’లో కత్రినాకైఫ్ చేసిన యాక్షన్ విన్యాసాలు సినిమా విడుదలకు ముందే చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా టవల్ని కట్టుకొని వేరే స్త్రీతో ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కత్రినా స్పందిస్తూ ‘ఇందులో నేను జోయా అనే స్పైగా నటించాను. పాత్రోచితంగా యాక్షన్ సీన్స్ చెయ్యాలి. చాలా కష్టపడి ఇష్టంగా చేశాను.
పురుషులతో సమానంగా పోరాడే వీరమహిళగా ఇందులో నన్ను చూస్తారు. ముఖ్యంగా ఇందులో నేను చేసిన టవల్ ఫైట్ బాగా వైరల్ అవుతుంది. ఆవిరులతో నిండిన గదిలో పోటాపోటీగా సాగే ఫైట్ ఇది. ఇద్దరు మహిళలు ఇలా నువ్వానేనా అని కొట్టుకోవడం ఇంతకు ముందు తెరపై ఎవరూ చూసుండరు. నవంబర్ 12న ‘టైగర్ 3’ రానుంది. నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది కత్రినా.