Katrina Kaif Dancing Video | బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా ఈమె చిన్నపిల్లలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ నాడులోని మధురైలో ఉన్న మౌంటెన్ వ్యూ స్కూల్లో చిన్నపిల్లలతో కలిసి ‘అరబిక్ కుత్తూ’ పాటకు కత్రినా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 96వేలకు పైగా వ్యూస్, 4500పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ వీడియోపై కత్రినా ఫ్యాన్స్ సూపర్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#katrinakaif dance in #Arabickuthu with kids 😍💞
Mountain View School pic.twitter.com/ogTPMp3rNd— myqueenkay (@myqueenkay1) September 25, 2022
కాగా మౌంటెన్ వ్యూ స్కూల్ 2015లో రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియాలో భాగంగా ప్రారంభమైంది. నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందంచడమే లక్ష్యంగా ఈ స్కూల్ ప్రారంభించబడింది. కత్రినా తల్లి సుజానే చాలా కాలంగా ఈ స్కూల్‌తో అనుబంధం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ స్కూల్లో సుజానే టీచర్‌గా కూడా పనిచేస్తుంది. వెనుక బడిన పిల్లల కోసం పాఠశాలలో తరగతి గదులను నిర్మించడానికి 2020లో విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరింది. పిల్లల కలలను నెరవేర్చడంలో మన వంతు కృషి చెద్దాం అంటూ కైఫ్ తల్లి చెప్పింది.
Read Also:
Ram Setu Movie | ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్ సేతు’ గ్లింప్స్..!
Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Ananya Pandey | ఓటీటీలోకి ‘లైగర్’ భామ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
Allu Sirish | అల్లు శిరీష్ కొత్త సినిమా టీజర్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?