Raja Delux Movie | ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో?
Prabhas-Maruthi Movie | ప్రభాస్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. 'బాహుబలి' వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో డార్లింగ్ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఈయన కంబ్యాక్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Prabhas-Maruthi Movie | ప్రభాస్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో డార్లింగ్ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఈయన కంబ్యాక్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్-మారుతి కాంబినేషన్లో సినిమా గురించి గత కొన్ని నెలలుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మారుతి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేశాడట. ప్రభాస్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందట. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మూవీ మొత్తం ‘రాజా డిలక్స్’ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో సాగుతుందట. ఇదే కథకి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి తన శైలిలో మూవీని తెరకెక్కించనున్నాడట. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం కోసం ఓ బాలీవుడ్ స్టార్ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ‘కేజీఎఫ్-2’, ‘షంషేరా’ వంటి సినిమాలతో విలనిజంను పండించిన సంజయ్ దత్‌ను ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ఎంపిక చేశారట. ఇప్పటికే చర్చలు కూడా ముగిసాయట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తుంది. కేవలం ఈ సెట్ కోసమే మేకర్స్ 6కోట్లు ఖర్చు చేశారట. ఇక మారుతి ఈ సినిమాను రెండు షెడ్యూల్స్‌లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్ని కుదిరితే నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ఛాన్స్ ఉందట.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే తెలిపారు. కాగా వచ్చే నెల నుండి చిత్రబృందం కంటీన్యూస్గా ప్రమోషన్లను జరుపనుందట. ఇక దీనితో పాటుగా ప్రభాస్ ‘సలార్’, ప్రాజెక్ట్- K’ చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Read Also:
Brahmastra Movie | ‘నేషనల్ ఫిలిం డే’న బ్రహ్మస్త్ర మూవీ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Dhamaka Movie | ‘ధమాకా’లో రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్నాడా?
Jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
శింబుకు కాస్ట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ‘వెందు తానింధాతు కాడు’ నిర్మాత.. ధర ఎంతో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

