Jawan Movie | భారీ ధరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా
Jawan Movie Non-Theatrical Rights | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన మూడు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు.
Jawan Movie Non-Theatrical Rights | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన మూడు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘జవాన్’ ఒకటి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ బిజినెస్ భారీ రేంజ్లో జరిగిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ.250 కోట్లకు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయట. జీ సంస్థ శాటిలైట్ హక్కులు దక్కించుకోగా.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. షారుక్ సినిమా వచ్చి నాలుగేళ్లయింది. పైగా లాస్ట్ సినిమా డిజాస్టర్.. అయినా కాని ‘జవాన్’ సినిమాకు ఈ రేంజ్లో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించనున్నాడు.
‘జవాన్’లో షారుఖ్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ‘డుంకి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో షారుఖ్‌కు జోడీగా తాప్సీ నటిస్తుంది.
Read Also:
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
DJ Tillu-2 | డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పుకున్న శ్రీలీల?
Brahmastra Movie | ‘నేషనల్ ఫిలిం డే’న బ్రహ్మస్త్ర మూవీ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

